ఆది. డిసెం 22nd, 2024

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) అక్టోబర్ 15న ప్రారంభమై ఇన్వెస్టర్ల ముందుకు వచ్చింది. మొదటి రోజు అర్ధరాత్రి 11:09 గంటల వరకు ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ 8 శాతం మాత్రమే నమోదు అయింది అని బిఎస్ఇ డేటా వెల్లడించింది. హ్యుందాయ్ ఐపీఓలో ఇన్వెస్టర్లు అక్టోబర్ 17 వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఒక్కో షేరుకు రూ.1,865-1,960 మధ్య ధర నిర్ణయించబడింది.

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ సంస్థకు చెందిన భారత విభాగం హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఐపీఓ ప్రారంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ. 8,315 కోట్లు సేకరించింది. హ్యుందాయ్ ఐపీఓ మొత్తం విలువ రూ.27,870 కోట్లు ఉండగా, ఇది సుమారు 3.3 బిలియన్ డాలర్లకు సమానం. గతంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓ విలువ రూ.21,000 కోట్లు కాగా, ఈసారి హ్యుందాయ్ ఐపీఓ మరింత పెద్దదిగా ఉంది.

ఇండియాలోని అతిపెద్ద ఐపీఓలు

ఇంతకుముందు వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) 2021లో రూ.18,300 కోట్ల ఐపీఓను తెచ్చింది. అంతకు ముందు కోల్ ఇండియా లిమిటెడ్ 2010లో రూ.15,199 కోట్ల విలువైన ఐపీఓను విడుదల చేసింది. 2008లో రిలయన్స్ పవర్ రూ.11,563 కోట్ల ఐపీఓను తీసుకొచ్చింది.

గ్రే మార్కెట్ పరిస్తితి

గ్రే మార్కెట్‌లో ప్రస్తుతం హ్యుందాయ్ షేర్లు రూ. 40 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి, అంటే షేర్లు 2 శాతం ప్రీమియంతో రూ. 2000 వద్ద లిస్ట్ అవుతాయని అంచనా. అయితే, ఇప్పటి వరకు గ్రే మార్కెట్‌లో ఈ షేర్లు 92 శాతం తగ్గాయి, దీనితో నెగటివ్ లిస్టింగ్ సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 27న షేర్లు రూ.570 వద్ద లభించాయి, కానీ ఆ తరువాత రోజుకి రోజూ పతనం అవుతూ వస్తున్నాయి.

యాంకర్ ఇన్వెస్టర్లు

న్యూవరల్డ్ ఫండ్ ఇంక్, సింగపూర్ సర్కార్, ఫిడిలిటీ ఫండ్స్, బ్లాక్ రాక్ గ్లోబల్ ఫండ్స్ వంటి సంస్థలు హ్యుందాయ్ ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్లుగా షేర్లను కేటాయించాయి. ఈ ఐపీఓలో మొత్తం 142,194,700 ఈక్విటీ షేర్లను హ్యుందాయ్ మోటార్ ప్రమోటర్ విక్రయించనుంది. ఈ ఐపీఓ పూర్తిగా ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) పై ఆధారపడి ఉంటుంది.

హ్యుందాయ్ మోటార్ అభివృద్ధి

1996లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన హ్యుందాయ్ మోటార్ ఇప్పటికే 13 మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక పెద్ద వాహన తయారీ సంస్థ ఐపీఓ ప్రారంభించడం అంటే మార్కెట్లో ఆసక్తి నెలకొన్నది. చివరిసారిగా జపాన్ కంపెనీ మారుతి సుజుకి 2003లో ఐపీఓను తీసుకొచ్చింది.

హ్యుందాయ్ కంపెనీ ఐపీఓ ద్వారా మార్కెట్లో షేర్ల లిస్టింగ్ జరిగితే, బ్రాండ్ ఇమేజ్, షేర్ల లిక్విడిటీ పెరుగుతాయని, మార్కెట్‌లో కంపెనీకి మరింత ఉజ్వలత వస్తుందని భావిస్తోంది